Xiaomi India | ఫెస్టివ్ సీజన్.. కలిసొచ్చిన వరల్డ్ కప్.. 5జీ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమీ న్యూ రికార్డు.. అదేమిటంటే.. !
Xiaomi India | ఫెస్టివ్ సీజన్.. క్రికెట్ వరల్డ్ కప్.. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi)కి మంచి ఊపు నిచ్చాయి. 2022లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న షియోమీ.. 2023లో జోరు మీదున్నది. 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంతో శక్తిని పుంజుకున్నది. భవిష్యత్‌పై ఆశావాదంతో ముందుకు సాగుతున్నది. ఈ ఏడాది ప్రారంభంలో చౌక ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఆవిష్కరించింది షియోమీ (Xiaomi). ఫలితంగా మెట్రో పాలిటన్ నగరాలు మొదలు చిన్న పట్టణాలు, …
